Share News

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Feb 04 , 2024 | 11:38 PM

గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఉచిత వెద్య శిబిరాలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు.

వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

కందుకూరు, ఫిబ్రవరి 4: గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఉచిత వెద్య శిబిరాలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. ఆదివారం దెబ్బడగూడ గ్రామంలో జస్టిస్‌ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ. పట్టణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయన్నారు. ఇంకా వైద్యసేవలు అందని వారికి తమ ఫౌండేషన్‌ ద్వారా అనేక ఉచిత శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శిబిరంలో 368మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అందులో 19మందికి శస్త్ర చికిత్సలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారు. దీంతో మంగళవారం వారిని అపోలో ఆస్పత్రికి తరలించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి, బీజేపీ నాయకుడు ఎల్మటి దేవేందర్‌రెడ్డి, ఎంపీటీసీ ఎల్మటి లక్ష్మి, నాయకులు కె.జంగారెడ్డి, చెన్నారెడ్డి, ఎస్‌ భూమిరెడ్డి, కె.సుధాకర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, డాక్టర్‌ సంతోష్‌, సయ్యద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అయోధ్య రామాలయ ప్రసాదాన్ని గ్రామస్తులకు పంపిణీ చేశారు.

Updated Date - Feb 04 , 2024 | 11:38 PM