Share News

మెగా కంటి వైద్యశిబిరం విజయవంతం

ABN , Publish Date - Nov 19 , 2024 | 11:14 PM

ఆమనగల్లు పట్టణంలోని శ్రీ లక్ష్మీగార్డెన్‌లో మంగళవారం నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్యశిబిరం విజయవంతమైంది. చెన్నై శంకరన్‌ నేత్రాలయం సహకారంతో ఐక్యత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. ఈనెల 27 వరకు కొనసాగే శిబిరానికి ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌, టాస్క్‌ సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు.

మెగా కంటి వైద్యశిబిరం విజయవంతం
శిబిరాన్ని ప్రారంభిస్తున్న సుంకిరెడ్డి వరప్రసాద్‌ రెడ్డి

ఆమనగల్లు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఆమనగల్లు పట్టణంలోని శ్రీ లక్ష్మీగార్డెన్‌లో మంగళవారం నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్యశిబిరం విజయవంతమైంది. చెన్నై శంకరన్‌ నేత్రాలయం సహకారంతో ఐక్యత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. ఈనెల 27 వరకు కొనసాగే శిబిరానికి ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌, టాస్క్‌ సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుంకిరెడ్డి వరప్రసాద్‌ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమనగల్లు, వెల్దండ, కల్వకుర్తి, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల నుంచి సుమారు 500 మంది శిబిరానికి హాజరయ్యారు. 350 మందికి పరీక్షలు నిర్వహించారు. దృష్టిలోపం ఉన్నవారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలు పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఐవోఎల్‌ ఆపరేషన్లు చేస్తామని డాక్టర్లు తెలిపారు. సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిని పలువురు అభినందించారు. మండ్లీ రాములు, కసిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, రచ్చ శ్రీరాములు, అభినవ్‌రెడ్డి, మల్లేశ్‌ నాయక్‌, కొండల్‌ యాదవ్‌, నరేందర్‌గౌడ్‌, మల్లయ్య, చంద్రశేఖర్‌, రమేశ్‌గౌడ్‌, రమేశ్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

వైద్యశిబిరాలను వినియోగించుకోవాలి

షాబాద్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ సర్పంచ్‌ శకుంతలా పాండు అన్నారు. మంగళవారం తిమ్మారెడ్డిగూడలో వెల్‌స్పన్‌ ఫౌండేషన్‌, షాద్‌నగర్‌ ఏబీవీ ఆసుపత్రి సహకారంతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 120 మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వెల్‌స్పన్‌ ప్రాజెక్టు మేనేజర్‌ భద్రయ్య, శిరిష, రమేష్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 11:14 PM