Share News

శరవేగంగా వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు

ABN , Publish Date - May 17 , 2024 | 12:50 AM

వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీన దేశప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీం కింద పనులను ప్రారంభించారు.

శరవేగంగా వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు
వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న ఆధునికీకరణ పనులు

  • ఇప్పటికే రూ.24.35కోట్లు మంజూరు

  • ఫిబ్రవరిలో వర్చువల్‌గా ప్రారంభించిన పీఎం మోదీ

  • తీరనున్న ప్రయాణికుల కష్టాలు

  • బుల్లెట్‌ ట్రైన్‌ ప్రకటనతో సర్వత్రా హర్షం

వికారాబాద్‌, మే 16: వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీన దేశప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీం కింద పనులను ప్రారంభించారు. ఆ పనులు ప్ర స్తుతం వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ రైల్వే స్టేషన్‌ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దనున్నారు. త్వరగా పనులు పూర్తయి వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

స్టేషన్‌లో కల్పించే సౌకర్యాలు

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీం కింద చేపడుతున్న పనుల్లో ముఖ్యంగా ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఏసీ గదులతో పాటు ప్రయాణికులకు మౌలిక సదుపాయల కల్పన, రైల్వే స్టేషన్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, ప్లాట్‌ ఫా మ్‌, టాయిలెట్స్‌ నిర్మాణాలు, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించనున్నారు. రైల్వే స్టేషన్‌లో ఆధునాతన పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ వి ధానం, ఎల్‌ఈడీ డీస్‌ప్లేతో స్టేషన్‌ పే రు కలిగిన బోర్డులు వినియోగదారులకు అనుకూలమైన సూచికల ఏర్పా టు వంటి అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

తీరనున్న ప్రయాణికుల కష్టాలు

వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌ జంక్షన్‌ కావడంతో నిత్యం వేలాది మంది ప్ర యాణికులు ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు ప్రయానిస్తుంటారు. వికారాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వందలాది మంది యువత ఉద్యోగులు, వారి పనుల నిమిత్తం ఉదయం సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లి వస్తుంటారు. అయితే మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన చాలా మంది ప్ర యాణికులు తిరుమల ఆలయ దర్శనానికి వికారాబాద్‌ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు వారు స్టేషన్‌లో సరైన సౌకర్యాలు లేక పట్టణంలోని గాంధీ పార్కు చెట్ల కింద కూర్చొని రైలు సమయానికి ఎక్కి వెళ్తున్నారు. ఇకపై వికారాబాద్‌ స్టేషన్‌లో ఏసీ గదులు, విశ్రాంతి గదుల్లో ఉండే అవకాశం లభించనుంది. ఎంత త్వరగా పనులు పూర్తయితే అంత త్వరగా ప్రయాణికుల కష్టాలు తీరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే స్టేషన్‌లో లిఫ్ట్‌ సౌకర్యాలను కల్పించారు.

బుల్లెట్‌ ట్రైన్‌పై ఆశలు

పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో వికారాబాద్‌ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వికారాబాద్‌ స్టేషన్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ ఆగుతుందని ప్రకటించారు. రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులతో పాటు వికారాబాద్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చి ఆగుతుందని ఆయన ప్రకటించడంతో జిల్లా ప్రజల్లో కొత్తఆశలు చిగురించాయి. ఈ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వికారాబాద్‌ రైల్వే స్టేష న్‌ నుంచి ముంబై, విశాఖపట్నం, తిరుపతి వంటి మహానగరాలకు వెళ్లే సౌకర్యాలు ఉండటంతో ప్రయాణం మరింత సులువు అవుతుందని ప్రజలు భావిస్తున్నారు.

Updated Date - May 17 , 2024 | 12:51 AM