అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు
ABN , Publish Date - Sep 20 , 2024 | 12:20 AM
తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెలలో అర్హులైన ప్రతీ ఒక్కరికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని, తొందరిపడి ఎవరుకూడా దళారులను నమ్మి మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
మహేశ్వరం, సెప్టెంబరు 19 : తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెలలో అర్హులైన ప్రతీ ఒక్కరికి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని, తొందరిపడి ఎవరుకూడా దళారులను నమ్మి మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ఉమార్రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్‌కమిటీ ఆహార భద్రత కార్డుల జారీపై విధివిధానాలను ప్రభుత్వానికి అందించగానే అక్టోబరులో కొత్త రేషన్ కార్డుల జారీ కొరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా, తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తుందన్నారు. రేషన్ సరుకులపై ఎంత భారమైనా పేదోడికి అండగా ఉండేందుకు ప్రజాపాలన కొనసాగుతుందన్నారు.