Share News

ఇసుక అక్రమాలకు కొత్తదారులు

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:02 AM

తాండూరు మండలం ఖాజాపూర్‌ వాగు నుంచి తాండూరు పట్టణం రైల్వేస్టేషన్లు జరుగుతున్న అభివృద్ధి పనుల నిమిత్తం 36 ట్రిప్పుల ఇసుక తరలింపు కోసం అనుమతులు పొందారు.

ఇసుక అక్రమాలకు కొత్తదారులు
ఒకే ట్రాలీ నెంబర్‌తో ఉన్న రెండు ట్రాక్టర్లు

తాండూరు, ఫిబ్రవరి 12: తాండూరు మండలం ఖాజాపూర్‌ వాగు నుంచి తాండూరు పట్టణం రైల్వేస్టేషన్లు జరుగుతున్న అభివృద్ధి పనుల నిమిత్తం 36 ట్రిప్పుల ఇసుక తరలింపు కోసం అనుమతులు పొందారు. నాలుగు రోజుల పాటు, 8 ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతి పొందారు. 36ట్రిప్పులను ఒకేరోజు ఇసుక తరలించే అవకాశం ఉన్నప్పటికీ నాలుగు రోజులు వ్యవధి కల్పించారు. ఇదే అదనుగా భావించిన ఇసుక అక్రమార్కులు ట్రాక్టర్‌ ట్రాలీ నెంబర్‌ టిఎస్‌ 34టి 97 39 పేరిట అనుమతులు పొంది మరో ట్రాక్టర్‌ట్రాలీకి అదే నంబర్‌ స్టిక్కర్‌ అతికించి ఒక ట్రాలీ రైల్వేస్టేషన్‌ తరలిస్తుండగా మరొకటి ట్ర్యాలీ వివిధ చోట్ల ఇసుకను డంపింగ్‌ చేయడంతో పాటు అక్రమంగా ఇసుకను అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులు ఎన్ని ట్రిప్పులకు ఇసుక అనుమతులు ఇస్తున్నారు. ఇక్కడ నుండి ఎక్కడి వరకు, ట్రాక్టర్లు ఫిట్‌నెస్‌ ఉన్నాయా? లేవా? డ్రైవర్లు ఎవరనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా అడ్డగోలుగా అనుమతులు ఇస్తూ డబ్బులు తింటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏడవ గ్యారంటీలో భాగంగా తాండూరులో ఇసుక సుద్దా అక్రమవ్యాపారం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఓవైపు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పేర్కొంటున్నప్పటికీ మరోవైపు అధికారులు ఇసుక అక్రమ రవాణా దారులు కుమ్మక్కై అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. వికారాబాద్‌లో ప్రభుత్వ భవనం నిర్మాణం పేరిట బాబి నుండి పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా తరలించారని ఆరోపణల ఉన్నాయి.

Updated Date - Feb 13 , 2024 | 12:02 AM