దైవచింతన అలవర్చుకోవాలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 11:53 PM
ప్రతీఒక్కరు దైవచింతన అలవర్చుకోవాలని, అప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.
కందుకూరు/మంచాల/నందిగామ, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ప్రతీఒక్కరు దైవచింతన అలవర్చుకోవాలని, అప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం నందిగామ మండల పరిధిలోని బుగ్గోనిగూడలో శివాలయంలో జరిగిన అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, నాయకులు జంగ నర్సింలు, క్రిష్ణారెడ్డి, కొమ్ము కృష్ణ, తదితరులున్నారు. కందుకూరు మండలం అగర్‌మియాగూడలో ఇరుముడి మహాపడిపూజ నిర్వహించారు. గ్రామానికి చెందిన 15మంది అయ్యప్ప మాలలు ధరించి 45 రోజుల పాటు భక్తి శ్రద్దలతో స్వామివారికి పూజలు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు లిక్కి జంగారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజకు ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఎస్.సురేందర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, డిల్లీ గణేష్, ప్రసన్న, లక్ష్మీనర్సింహారెడ్డి, తదితరులున్నారు. మంచాల మండలం జాపాలలో బకున సుకన్యచంద్రకాంత్ దంపతుల ఆధ్వర్యంలో పడిపూజ, అన్నప్రసాద వితరణ చేశారు. స్వామి వారిని పల్లకీలో ఊరేగింపు నిర్వహించారు. భజనమండలి శ్రీశైలం గురుస్వామి ఆధ్వర్యంలో ఆలపించిన అయ్యప్ప పాటలు అలరించాయి. పడిపూజ అనంతరం గ్రామానికి చెందిన 32 మంది అయ్యప్ప మాలధారులు ఇరుముడులు శబరికి తరలివెళ్లారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాష్ట్రనేత క్యామ మల్లేష్, మండలాధ్యక్షుడు రమేష్, చంద్రయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.