దైవభక్తితో మానసిక ప్రశాంతత : ఎమ్మెల్యే
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:53 PM
దైవభక్తి ఉంటేనే మానసిక ప్రశాంతతో జీవనం గడుపుతామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని ఫరూఖ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన వీరాంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవం, హనుమాన్, వినాయకుడు, నవగ్రహాలు, ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనను బుధవారం నిర్వహించారు.
షాద్‌నగర్ అర్బన్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): దైవభక్తి ఉంటేనే మానసిక ప్రశాంతతో జీవనం గడుపుతామని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని ఫరూఖ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన వీరాంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవం, హనుమాన్, వినాయకుడు, నవగ్రహాలు, ధ్వజస్థంభ ప్రతిష్ఠాపనను బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే ఆలయాన్ని నిర్మించి, భక్తితో విగ్రహాల ప్రతిష్టాపన నిర్వహించడం ఎంతో ఆనందమని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, ప్రతా్‌పరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్, కౌన్సిలర్ శ్రావణి, కాంగ్రెస్ నాయకులు అగ్గనూరి విశ్వం, శివశంకర్‌గౌడ్, బాబర్‌ఖాన్, జమృద్‌ఖాన్, అగ్గనూరి బస్వం, కృష్ణారెడ్డి, కట్ట వెంకటే్‌షగౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు వి.నారాయణరెడ్డి, చీపిరి రవియాదవ్, పట్టణవాసులు గందం ఆనంద్, పిల్లి శేఖర్, చెరుకు శివ, ఆకుల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్పలకు అన్నదానం మహాపుణ్యం
అయ్యప్పలకు అన్నదానం చేయడం మహాపుణ్యమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని చౌడమ్మగుట్ట ఆంజనేయస్వామి ఆలయ సన్నిధానంలో ఎమ్మెల్యే సొంత ఖర్చుతో అయ్యప్పలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. మాజీ ఎంపీ పీ ప్రకా్‌షగౌడ్, కాంగ్రెస్ నాయకులు శ్రీశైలంగౌడ్, సూర్యప్రకాష్, కృష్ణ, వెంకటే్‌షగౌడ్, బస్వం, బీజేపీ నాయకుడు మురళి, నిర్వాహకులు పాల్గొన్నారు.