ఆపరేషన్ చేస్తుండగా గర్భిణి మృతి
ABN , Publish Date - Oct 06 , 2024 | 11:37 PM
తాండూరు నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో ఓ గర్భిణి ఆపరేషన్ చేస్తుండగా మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
తాండూరు, అక్టోబరు 6: తాండూరు నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో ఓ గర్భిణి ఆపరేషన్ చేస్తుండగా మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఇంద్రానగర్‌కు చెందిన అక్షిత మొదటిసారి గర్భం దాల్చింది. ప్రసవం నిమిత్తం అత్తగారిల్లు కోస్గి మండలం కొత్తపల్లి నుంచి తాండూరుకు వచ్చింది. అయితే, అక్షిత గర్భంలో పెరుగుతున్న శిశువు వెన్నెపూస లేకుండా ఉందని పలుఆస్పత్రిల్లో చూపించగా వైద్యులు తెలిపారు. శిశువు పుట్టినా ఇబ్బందులు ఏర్పడుతాయని సూచించారు. దాంతో కుటుంబసభ్యులు తాండూరు నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. ఆదివారం శిశువును తొలగించే క్రమంలో గర్భిణీ అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతిచెందింది. దాంతో కుటుంబీకులు బోరున విలపించారు. అయితే, గర్భిణికి చికిత్స అందిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో మృతిచెందిందని, ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేదని ఆస్పత్రి యజమాన్యం ప్రకటించింది.