Share News

రంజిత్‌రెడ్డి విజయానికి కృషి చేయాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:41 AM

మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్‌) కోరారు.

రంజిత్‌రెడ్డి విజయానికి కృషి చేయాలి
మహేశ్వరం : కాంగ్రెస్‌లో చేరుతున్న గట్టుపల్లి మాజీ సర్పంచ్‌ సౌడయ్య, మాజీ ఎంపీటీసీ సావిత్రి

కందుకూరు ఏప్రిల్‌ 18: మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్‌) కోరారు. గురువారం వైస్‌ ఎంపీపీ శమంత ప్రభాకర్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకుడు ఎగిరిశెట్టి నర్సింహల ఆధ్వర్యంలో నేదునూరు పార్టీ అధ్యక్షుడు బొర్ర సురేష్‌, పార్టీ నాయకులు తుక్కుగూడలోని కేఎల్లార్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. క బీసీ సెల్‌ నేదునూరు శాఖ అధ్యక్షుడు భాస్కర్‌, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు జగన్‌, నాయకులు పాల్గొన్నారు.

సామాజిక న్యాయం కోసం పాటుపడాలి

భారత రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య, లౌకికవాద, సామాజిక న్యాయం కోసం ప్రజాప్రతినిధులు, పాలకులు కృషిచేయాలని దళిత, బహుజన శ్రామిక యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండు నర్సింహ కోరారు. ఈ మేరకు గురువారం పీసీసీ సభ్యుడు ఏనుగు జంగారెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు.

కాంగ్రె్‌సను తిరుగులేని శక్తిగా తయారు చేయాలి

మహేశ్వరం/మియాపూర్‌ : మహేశ్వరంలో కాంగ్రె్‌సను తిరుగులేని శక్తిగా తయారు చేయాలని మండల మాజీ ఎంపీపీ కె.రఘుమారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గట్టుపల్లి మాజీ సర్పంచ్‌ సౌడయ్య, మాజీ ఎంపీటీసీ సావిత్రిలతో పాటు మరికొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు రఘుమారెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. మాజీ సర్పంచ్‌ రాకే్‌షరెడ్డి, ఎండీ సాబేర్‌, ఎర్ర యాదగిరి, కుమార్‌, రాజు, రమేష్‌, మహ్మద్‌, అంజయ్య తదితరులున్నారు. శేరిలింగంపల్లి నియోకవర్గ ఇన్‌చార్జి జగదీశ్వర్‌గౌడ్‌ హఫీజ్‌పేట డివిజన్‌ ఓల్డ్‌ హఫీజ్‌పేట, రాయదుర్గంలో కార్పొరేటర్‌ పూజితతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

చేవెళ్లలో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయం

మొయినాబాద్‌ రూరల్‌ : మండల పరిధిలోని చిన్నమంగళారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ రంజిత్‌రెడ్డికి ఓటు వేయాలని ేవెళ్ల ఆసెంబ్లీ ఇన్‌చార్జి పామెన భీంభరత్‌రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. కీసరి సంజీవరెడ్డి, షాబాద్‌ దర్శన్‌, గౌరి సతీష్‌, పార్టీ మండలాధ్యక్షుడు మాణెయ్య, పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

చేవెళ్ల : పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పని చేయాలని భీంభరత్‌, చేవెళ్ల అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జి సత్యనారాయణరెడ్డి కోరారు. చేవెళ్ల మండలం రావులపల్లి గ్రామంలో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకుముందు గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శంకర్‌పల్లి మండలం మీర్జగూడ, ఇంద్రారెడ్డినగర్‌ ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళ ప్రధాన కార్యదర్శి జ్యోతి భీంభరత్‌, మండల అధ్యక్షురాలు దేవర సమతరెడ్డి, ప్రధాన కార్యదర్శి సరితారెడ్డి, చేవెళ్ల, రావులపల్లి గ్రామాల మాజీ సర్పంచ్‌లు శైలజాఆగిరెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీతోనే దేశాభివృద్ధి

షాబాద్‌ : కాంగ్రె్‌సతోనే దేశం అభివృద్ధి చెందుతుందని పామెన భీంభరత్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, కార్యదర్శి సురేందర్‌రెడ్డిలు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నసోలిపేట్‌, పెద్దసోలిపేట్‌ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి రంజిత్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. మండలాధ్యక్షుడు చంద్రశేఖర్‌, వర్కింగ్‌ ప్రెసిడెట్లు చెన్నయ్య, నర్సింహులు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ మల్లేష్‌, ఎంపీటీసీ జయమ్మవెంకట్‌రెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి, పెంటారెడ్డి, తొంట వెంకటయ్య, సుభా్‌షరెడ్డి, వేణు, చేవెళ్ల స్వామి, నరేందర్‌ పాల్గొన్నారు.

భారీ మెజారిటీతో గెలిపించాలి

వికారాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం నిర్వహించారు. నవాబుపేట మండలంలోని మమ్‌దాన్‌పల్లి, కుమ్మరిగూడా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మేడిపల్లి వెంకటయ్య, మధుసూదన్‌రెడ్డి, సామ వెంకట్‌రెడ్డి, కర్ణం రఘు తదితరులు పాల్గొన్నారు.

కులకచర్ల: కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వికారాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కులకచర్లలోని పీజేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డితో కలిసి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, డీసీసీ ఉపాధ్యక్షుడు భీమ్‌రెడ్డి, జిల్లా యువజన నాయకులు రుతిక్‌రెడ్డి, సిద్ధార్థరెడ్డి, బ్లాక్‌ బీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు భరత్‌కుమార్‌, సింగిల్‌విండో చైర్మన్‌ మొగులయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బీఎస్‌ ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గోపాల్‌నాయక్‌, మాజీ ఎంపీపీ అంజిలయ్యగౌడ్‌, ఎంపీటీసీ ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:41 AM