Share News

ఉరేసుకొని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Feb 16 , 2024 | 12:07 AM

ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ అద్దె బస్సు నడుపుతున్న ఓ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు..

ఉరేసుకొని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ ఆత్మహత్య

యాచారం, ఫిబ్రవరి 15 : ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ అద్దె బస్సు నడుపుతున్న ఓ డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. యాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గున్‌గల్‌ గ్రామానికి చెందిన అండాలు, జంగయ్య దంపతుల ఏకైక కుమారుడు శశి(23) ఇబ్రహీంపట్నం డిపోలో ఆర్టీసీ అద్దె బస్సు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం బంధువుల ఇంట్ల్లో జరిగిన వివాహానికి హాజరై సాయంత్రం మిత్రులతో సరదాగా కాలం గడిపాడు. రాత్రి ఇంటికి చేరుకున్నాక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు గమనించి పోలీసులకు సమాచారంఅందించారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు యాచారం పోలీసులు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శంకర్‌కుమార్‌ తెలిపారు. కాగా, వైస్‌ ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి మృతదేహానికి నివాళుల ర్పించారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వలస కూలీ..

షాబాద్‌, ఫిబ్రవరి 15 : ఉరేసుకొని వలస కూలీ మృతిచెందిన ఘటన షాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ యాదయ్యగౌడ్‌ తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్‌లోని చత్తాపూర్‌నకు చెందిన రతికుశ్వ, కుమారుడు రంజిత్‌కుశ్వ, కూతురు సీతాకుశ్వలు బతుకుదెరువు నిమిత్తం కొంత కాలం క్రితం చందన్‌వెళ్లికి వలసవచ్చారు. కుందనా టెక్స్‌టైల్స్‌ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. రెండు, మూడు రోజులుగా సీత(20) అనారోగ్యంతో బాధపడుతోంది. తల్లి, సోదరుడు పనులకు వెళ్తే ఆమె ఇంటివద్దనే ఉంటోంది. గురువారం రతికుశ్వ ఇంటికి వచ్చే సరికి సీత రేకులషెడ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుందేమోనని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 16 , 2024 | 12:07 AM