Share News

రైతు శ్రేయస్సే కాంగ్రెస్‌ లక్ష్యం : వీర్లపల్లి

ABN , Publish Date - Nov 29 , 2024 | 11:41 PM

రైతు శ్రేయస్సే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. రైతు ప్రయోజనాలు, సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు రైతు పండుగ నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు, రైతులు శుక్రవారం తరలివెళ్లారు.

రైతు శ్రేయస్సే కాంగ్రెస్‌ లక్ష్యం : వీర్లపల్లి
బస్సును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శంకర్‌

షాద్‌నగర్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రైతు శ్రేయస్సే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. రైతు ప్రయోజనాలు, సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు రైతు పండుగ నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు, రైతులు శుక్రవారం తరలివెళ్లారు. ఈక్రమంలో షాద్‌నగర్‌ నుంచి ప్రత్యేక బస్సును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పంటల భీమా పథకాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎత్తివేసిందని, సీఎం రేవంత్‌రెడ్డి తిరిగి ప్రారంభిచడంతో పాటు, అందుకు చెల్లించాల్సిన ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిచండం హర్షణీయమన్నారు. ఆధునిక పద్దతిలో లాభసాటి వ్యవసాయం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు.

‘రైతు పండగ’కు బస్సుల ఏర్పాట్లు : ఏడీఏ

చేవెళ్ల, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు పండగ కార్యక్రమానికి చేవెళ్ల డివిజన్‌ నుంచి భారీ సంఖ్యలో రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చేవెళ్ల ఏడీఏ సురేశ్‌బాబు తెలిపారు. శుక్రవారం ఆయన చేవెళ్లలో విలేకరులతో మాట్లాడుతూ రైతు పండగ కార్యక్రమానికి చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌ తదితర మండలాల నుంచి రైతులను ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల్లో తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. చేవెళ్ల డివిజన్‌ నుంచి 15 బస్సుల్లో.. 50 మంది చొప్పున తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. అన్ని మండలాల నుంచి నేడు(శనివారం) ఉదయం 9 గంటలకు బస్సులు మహబూబ్‌నగర్‌కు బయలుదేరుతాయన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:41 PM