Share News

అభివృద్ధిని ఓర్వలేని సబితా ఇంద్రారెడ్డి

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:18 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో జరగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అడ్డుపడుతోందని మాజీ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు.

అభివృద్ధిని ఓర్వలేని సబితా ఇంద్రారెడ్డి
మాట్లాడుతున్న మాజీ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి

కందుకూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో జరగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అడ్డుపడుతోందని మాజీ జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ నేతలతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ మహేశ్వరం ఇన్‌చార్జి కేఎల్లార్‌ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ముచ్చర్లలో స్కిల్స్‌ వర్సిటీ, ఇంటిగ్రేషన్‌ సిటీ, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం నెలకొల్పడానికి కృతనిచ్చయంతో ఉన్నట్లు గుర్తుచేశారు. ఇలాంటి అభివృద్ధి పనులు బీఆర్‌ఎస్‌ నేతలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కొత్తగా రోడ్డు, మెట్రో రైలు నిర్మాణం చేపట్టడం ఈ ప్రాంత ప్రజలకు సంతోషంగా ఉందని, బీఆర్‌ఎస్‌ నాయకులు రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైఎస్‌ ఎంపీపీ శమంత ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఎండి అప్జల్‌బేగ్‌, డిల్లీ శ్రీధర్‌, కంబల్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, పాండురంగారెడ్డి, ఎడ్ల కృష్ణ, జగదీ్‌ష కురుమ, కు మార్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:18 AM