Share News

గడువు ముగిసిన తినుబండారాల విక్రయం.. వ్యక్తిపై కేసు

ABN , Publish Date - Apr 11 , 2024 | 12:12 AM

గడువు ముగిసిన తినుబండారాలు అమ్ముతున్న దుకాణాదారుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరవింద్‌ తెలిపారు. బుధవారం పక్కా సమాచారం మేరకు మోమిన్‌పేట్‌ అంజయ్య కిరాణ దుకాణంలో గడువు ముగిసిన బిస్కెట్‌ ప్యాకెట్లు, నూడుల్స్‌, చిప్స్‌ ప్యాకెట్లు అమ్ముతున్నారని దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు.

గడువు ముగిసిన తినుబండారాల విక్రయం.. వ్యక్తిపై కేసు

మోమిన్‌పేట్‌, ఏప్రిల్‌ 10: గడువు ముగిసిన తినుబండారాలు అమ్ముతున్న దుకాణాదారుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరవింద్‌ తెలిపారు. బుధవారం పక్కా సమాచారం మేరకు మోమిన్‌పేట్‌ అంజయ్య కిరాణ దుకాణంలో గడువు ముగిసిన బిస్కెట్‌ ప్యాకెట్లు, నూడుల్స్‌, చిప్స్‌ ప్యాకెట్లు అమ్ముతున్నారని దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో దుకాణదారులు గడువు ముగిసిన వస్తువులను అమ్మరాదని హెచ్చరించారు. దుకాణదారుడు అంజయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - Apr 11 , 2024 | 12:12 AM