నిర్మాణ రంగ కార్మికులకు పథకాలను అందించాలి
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:58 PM
భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు పథకాలందించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి కోటం రాజు కోరారు.
ఆమనగల్లు, అక్టోబరు 1 : భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు పథకాలందించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి కోటం రాజు కోరారు. నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ పథకాలను బీమా కంపెనీలకు కాకుండా ప్రభుత్వమే సంక్షేమబోర్డు ద్వారా నేరుగా వర్తింపజేయాలన్నారు. ఆమనగల్లులో మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. ఆలేటి నారాయణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి నాయకులు హాజరై మాట్లాడారు. అంతకు ముందు ఆమనగల్లులో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తున్నాయన్నారు. ప్రతీ కార్మికుడు లేబర్ కార్డు తీసుకొని పథకాలు పొందాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐటీయూ ఏరియా కమిటీ కన్వీనర్ జె.పెంటయ్య, సంఘం అధ్యక్షుడు యాదయ్య, కార్యదర్శి యాదయ్య, కోశాధికారి చంద్రమౌళి, ఎండీ జహంగీర్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.