Share News

25కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Dec 06 , 2024 | 11:59 PM

25కిలోల గంజాయిని తరలిస్తున్న ముఠాను శామీర్‌పేట్‌ పోలీసులు, ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా దాడిచేసి పట్టుకున్నారు.

25కిలోల గంజాయి పట్టివేత

మూడుచింతలపల్లి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): 25కిలోల గంజాయిని తరలిస్తున్న ముఠాను శామీర్‌పేట్‌ పోలీసులు, ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా దాడిచేసి పట్టుకున్నారు. ఈ ఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒరిస్సాకు చెందిన కొందరు కారులో నగరానికి గంజాయిని తరలిస్తున్న సమాచారం మేరకు ఎస్‌వోటీ, శామీర్‌పేట్‌ పోలీసులు దాడులు నిర్వహించి 25కిలోల గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Dec 06 , 2024 | 11:59 PM