Share News

కబేళాలకు తరలిస్తున్న పశువుల పట్టివేత

ABN , Publish Date - Jul 19 , 2024 | 12:34 AM

పశువులను కబేళాలకు తరలిస్తున్న కంటైనర్‌ను అదుపులోకి తీసుకోని డ్రైవర్‌పై పోచారం ఐటీసీ పోలీసులు కేసు నమోదు చేశారు.

కబేళాలకు తరలిస్తున్న పశువుల పట్టివేత

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూలై 18: పశువులను కబేళాలకు తరలిస్తున్న కంటైనర్‌ను అదుపులోకి తీసుకోని డ్రైవర్‌పై పోచారం ఐటీసీ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రాజువర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోచారం ఐటీసీ పోలీ్‌సస్టేషన్‌ పరిధి డీ-మార్ట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదస్థితిలో బీబీనగర్‌ వైపు నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న కంటైనర్‌ తనిఖీ చేశారు. అందులో 25 పశువులు ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘనాపూర్‌ మండలం, వడ్డిచెర్ల గ్రామానికి చెందిన డ్రైవర్‌ అప్రద్‌(23)అదుపులోకి తీసుకొని విచారించగా, జనగామ, స్టేషన్‌ ఘనాపూర్‌, ఐనవోలు పరిసర ప్రాంతాల నుంచి పశువులను కొనుగోలు చేసి నగరంలోని కబేళాకు తరలిస్తున్నట్లు తెలిపారు. పశువులను నగరంలోని జియాగూడ గోశాలకు తరలించారు. కంటైనర్‌ను అదుపులోకి తీసుకోని, డ్రైవర్‌ అప్రద్‌పై కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అదేవిధంగా యంనంపేట్‌ చౌరస్తాలో గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదస్ధితిలో బీబీనగర్‌ నుంచి నగరానికి వెళుతున్న డీసీఎం తనిఖీ చేశారు. డీసీఎంను తనిఖీ చేయగా అందులో 39 ఆవులు, 29 ఎద్దులు నగరంలోని కబేళాకు తరలిస్తున్నాడు. నగరంలోని బీఎన్‌రెడ్డి నగర్‌కు చెందిన డ్రైవర్‌ నేనావత్‌ రాజు(20)ను అదుపులోకి తీసుకోని విచారించగా, ఒడిస్సా రాష్ట్రం నవరంగ్‌ గ్రామం నుంచి సబావత్‌ విజయ్‌ పశువులను కొనుగోలు చేసి ఒకదానిపై మరొకటి తాళ్లతో కట్టేసి నగరంలోని బహదూర్‌ పూర కబేళాకు తరలిస్తున్నట్లు తెలిపారు. అందులో ఒక ఆవు, ఒక ఎద్దు మృతిచెందినట్లు తెలిపారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి డీసీఎం నెంబర్‌ప్లేట్‌ మార్చి డీసీఎంను తిప్పుతున్నాడని తెలిపారు. పశువులను నగరంలోని జియాగూడ గోశాలకు తరలించి, డీసీఎంను అదుపులోకి తీసుకొని, డ్రైవర్‌ రాజు, పశువులు కొనుగోలు చేసిన విజయ్‌లపై పలు సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు.

Updated Date - Jul 19 , 2024 | 12:34 AM