Share News

వణికిస్తున్న చలి

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:07 PM

ఉమ్మడి జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడి పోతున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో చలిగాలుల తీవ్రత పెరిగి పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

వణికిస్తున్న చలి
శంషాబాద్‌ సమీపంలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేదారిలో కురుస్తున్న మంచు

ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

మర్పల్లిలో 10.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) ఉమ్మడి జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడి పోతున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో చలిగాలుల తీవ్రత పెరిగి పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో అత్యల్పంగా ఉష్ణోగ్రత 10.6 డిగ్రీల నమోదైంది. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందనవెల్లిలో 11.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, మేడ్చల్‌ జిల్లా 13.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - Nov 20 , 2024 | 11:07 PM