డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆరుగురికి జరిమానా
ABN , Publish Date - Dec 21 , 2024 | 12:05 AM
తాండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిర్వహిస్తుండగా ఆరుగురికి జరిమానా, ఒక వ్యక్తికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు తాండూరు ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపారు.
తాండూరు, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): తాండూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిర్వహిస్తుండగా ఆరుగురికి జరిమానా, ఒక వ్యక్తికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు తాండూరు ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి ఎదుట శుక్రవారం డ్రంక్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ఆరుగురిని హాజరుపరచగా వారికి వేయి రూపాయల చొప్పున జరిమాన విధించగా మరో వ్యక్తి చెంగోల్ గ్రామానికి చెందిన మనోహర్‌కు వేయి రూపాయల జరిమానా, ఒకరోజు జైలుశిక్ష విధించినట్లు చెప్పారు.