‘సమగ్ర’ సమ్మెకు సంఘీభావం
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:09 AM
సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక దీక్ష శనివారం 15వ రోజుకు చేరింది. కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న సమ్మెకు సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రచారి సంఘీభావం ప్రకటించారు.
కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న ఉద్యోగుల నిరసన
మద్దతు తెలిపిన సీపీఐ నాయకులు
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక దీక్ష శనివారం 15వ రోజుకు చేరింది. కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న సమ్మెకు సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆందోజు రవీంద్రచారి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు రెండు దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా వారి సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదన్నారు. రాష్ట్ర సమగ్ర ఉద్యోగుల సంఘం కోశాధికారి, రాష్ట్ర సమన్వయకర్తల సంఘం కార్యదర్శి శ్రీదుర్గం శ్రీను దీక్షకు మద్దతుగా తెలిపి మాట్లాడారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్, ప్రధాన కార్యదర్శి సంపత్, కోశాధికారి సాయికుమార్, శ్రీలత, పద్మ, భార్గవి, సుజాత పాల్గొన్నారు.