లగచర్ల గిరిజనులకు సంఘీభావం
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:48 PM
వికారాబాద్ జిల్లా లగచర్ల గిరిజనులకు మద్దతుగా బుధవారం కడ్తాల మండల కేంద్రంలో బీఆర్‌ఎ్‌స్ గిరిజన నేతలు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. కడ్తాల మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కడ్తాలలో బీఆర్‌ఎస్ గిరిజన నేతల ర్యాలీ
కడ్తాల్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా లగచర్ల గిరిజనులకు మద్దతుగా బుధవారం కడ్తాల మండల కేంద్రంలో బీఆర్‌ఎ్‌స్ గిరిజన నేతలు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. కడ్తాల మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాల బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అల్లుడి స్వలాభం కోసం సీఎం అమాయక గిరిజనుల భూములను ఫార్మా పేరుతో లాక్కోవడానికి చూస్తున్నారని మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్, బీఆర్‌ఎ్‌స్ ఆమనగల్లు పట్టణాధ్యక్షుడు పత్యనాయక్, మాడ్గుల మాజీ ఎంపీపీ జైపాల్‌నాయక్‌లు ఆరోపించారు. అనంతరం దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో లగచర్లకు తరలి వెళ్లారు. నాగులు, లచ్చిరామ్ నాయక్, సేవ్యనాయక్, తులసీరామ్ నాయక్, లోకేశ్ నాయక్, హరిచంద్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
లంబాడీల భూముల జోలికొస్తే తిరగబడతాం
షాద్‌నగర్ అర్బన్/కొత్తూర్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి లంబాడీల భూముల జోలికొస్తే తిరుగుబాటు తప్పదని ఎల్‌ఎచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్‌నాయక్ హెచ్చరించారు. చలో లగచర్ల కార్యక్రమానికి ఎల్‌ఎచ్‌పీఎస్ రాష్ట్రశాఖ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఎల్‌ఎచ్‌పీఎస్, గిరిజన సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు. రాంబల్‌నాయక్ మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ ఫార్మా కంపెనీలకు ధారాదత్తం చేయడానికి లగచర్లలోని 1,300 ఎకరాల గిరిజన భూములను లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందన్నారు. గిరిజనులపై కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇకముందు గిరిజనుల భూముల జోలికోస్తే ఆందోళన తప్పదని రాంబల్‌నాయక్ హెచ్ఛరించారు. గిరిజన సంఘాల నాయకులు విస్లావత్ చందర్‌నాయక్, జర్పుల లింబ్యనాయక్, వి. చందునాయక్, లక్ష్మణ్‌నాయక్, తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు. అలాగే చలో లగచర్ల సందర్భంగా కొత్తూర్ ఎల్‌హెచ్‌పీఎ్‌స నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి సాయంత్రం వదిలిపెట్టారు. నాయకులు లక్ష్మణ్‌నాయక్, గోపాల్‌నాయక్, మెహన్‌నాయక్, నర్సింహ, బలరాం, చందర్‌లను అరెస్ట్ చేశారు.