Share News

తండ్రి మరణంపై అనుమానాలున్నాయని కుమారుడి ఫిర్యాదు

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:24 AM

తండ్రి మరణంపై అనుమానం ఉందని ఓ వ్యక్తి మంగళవారం శంషాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. బైండ్ల బాలరాజ్‌, అతడి తమ్ముడు అనిల్‌లు సుల్తాన్‌పూర్‌ పంచాయతీ పరిధిలోని కేబీ దొడ్డి గ్రామంలో నివాసముంటున్నారు.

తండ్రి మరణంపై అనుమానాలున్నాయని కుమారుడి ఫిర్యాదు

శంషాబాద్‌ రూరల్‌, 16 : తండ్రి మరణంపై అనుమానం ఉందని ఓ వ్యక్తి మంగళవారం శంషాబాద్‌ పోలీసులను ఆశ్రయించాడు. వివరాలిలా ఉన్నాయి. బైండ్ల బాలరాజ్‌, అతడి తమ్ముడు అనిల్‌లు సుల్తాన్‌పూర్‌ పంచాయతీ పరిధిలోని కేబీ దొడ్డి గ్రామంలో నివాసముంటున్నారు. బాలరాజ్‌ పెయింటింగ్‌ పని కోసం కొన్ని రోజులుగా ప్రొద్దుటూర్‌లో ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 8.30గంటల సమయంలో శివకుమార్‌ అనే వ్యక్తి బాలరాజ్‌కు ఫోన్‌ చేసి మీ తండ్రి మరణించాడని చెప్పాడు. దాంతో అతను స్వగ్రామానికి వెళ్లి తండ్రి లక్ష్మణ్‌(60) నడుము భాగం, కాళ్లు ఇతర భాగాల వద్ద చీమలుండడం చూసి విస్తుపోయాడు. తల్లి నవనీతపై తనకు అనుమానం ఉందని, పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శంషాబాద్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Apr 17 , 2024 | 07:54 AM