పథకాల అమలులో తెలంగాణ ఆదర్శం
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:23 AM
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మునుపెన్నడూ లేనివిధంగా పేదలకు వైద్య చికిత్సలకు పెద్దఎత్తున ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
ఆమనగల్లు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మునుపెన్నడూ లేనివిధంగా పేదలకు వైద్య చికిత్సలకు పెద్దఎత్తున ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు చెందిన పలువురు లబ్దిదారులకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కల్వకుర్తిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్లు గీతా నర్సింహ, మనీలసంజీవ, మాజీ సర్పంచ్‌లు ఆనంద్ కుమార్, సుదర్శన్‌రెడ్డి, నాయకులు, గోలి సురేందర్‌రెడ్డి, విజయ్‌రాథోడ్, జెల్ల రమేశ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.