Share News

యాచారం ప్రభుత్వాసుపత్రికి తాత్కాలిక మరమ్మతులు

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:00 AM

యాచారం ప్రభుత్వాసుపత్రి భవనానికి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టనున్నట్లు పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజనీర్లు డీఈ శ్రీనివాస్‌, ఏఈలు ఉస్మాన్‌, సిద్దార్థలు తెలిపారు.

యాచారం ప్రభుత్వాసుపత్రికి తాత్కాలిక మరమ్మతులు
ప్రభుత్వాసుపత్రి భవనం పైభాగాన్ని పరిశీలిస్తున్న ఇంజనీర్ల బృందం

పంచాయతీరాజ్‌ శాఖ డీఈ శ్రీనివాస్‌

ఇటీవల హాస్పిటల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌

సమస్యలు విన్నవించిన వైద్యులు

యాచారం, అక్టోబరు 1 : యాచారం ప్రభుత్వాసుపత్రి భవనానికి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టనున్నట్లు పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజనీర్లు డీఈ శ్రీనివాస్‌, ఏఈలు ఉస్మాన్‌, సిద్దార్థలు తెలిపారు. కాగా, ఇటీవల ఆసుపత్రి భవనాన్ని కలెక్టర్‌ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పలుచోట్ల పెచ్చులూడటంతో రోగులు, వైద్యులపై పడిన సందర్భాలున్నాయి. దాంతో తీవ్ర ఇబ్బందుల పడుతున్నామని కలెక్టర్‌ దృష్టికి వైద్యులు తీసుకెళ్లారు. ఈమేరకు కలెక్టర్‌ ప్రభుత్వాసుపత్రిని సందర్శించి మరమ్మతులకయ్యే వ్యయంపై ఎస్టిమేషన్‌ వేసి నివేదిక ఇవ్వాలని ఇంజనీర్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఇంజనీర్ల బృందం ఆసుపత్రిని సందర్శించి మరమ్మతులు చేపట్టాల్సిన ప్రదేశాలను గుర్తించారు. ఇప్పట్లో కొత్త భవనం నిర్మించడం చాలా కష్టమని, ఉన్న భవనానికి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చించి కొత్త హంగులు కల్పించాలని కలెక్టర్‌కు నివేదించనున్నట్లు ఇంజనీర్లు తెలిపారు.

Updated Date - Oct 02 , 2024 | 12:00 AM