Share News

ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి పదేళ్ల జైలు

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:51 PM

మద్యం మత్తులో ఆటోను అజాగ్రత్తగా నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఆటో డ్రైవర్‌కు న్యాయమూర్తి పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించినట్లు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి పదేళ్ల జైలు

షాద్‌నగర్‌రూరల్‌, అక్టోబరు23(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఆటోను అజాగ్రత్తగా నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఆటో డ్రైవర్‌కు న్యాయమూర్తి పదేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించినట్లు ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన బోడంపాటి గోవర్ధన్‌(50) అక్టోబర్‌ 10 2021న వ్యక్తిగత పని నిమిత్తం షాద్‌నగర్‌ వచ్చి తిరిగి వెళ్లెందుకు ఆటో ఎక్కాడు. అప్పటికే మద్యం తాగిఉన్న కావలి శ్రీను వేగంగా, అజాగ్రత్తగా ఆటోను నడపడంతో బోల్తా పడింది. అందులోఉన్న పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన గోవర్ధన్‌ను శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి బంధువు కృష్ణయ్య గౌడ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో ఎల్‌బీ నగర్‌ అడిషినల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి హరిత నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష, రూ.23వేల జరిమానా విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Oct 24 , 2024 | 06:52 AM