Share News

నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత

ABN , Publish Date - Aug 16 , 2024 | 11:38 PM

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది.

నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద ఉద్రిక్తత

  • మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు భర్తీ..

  • చివరకు సీట్లు లేవన్న యాజమాన్యం

  • విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

మేడ్చల్‌ టౌన్‌, ఆగస్టు 16: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడ నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మేనేజ్‌మేంట్‌ కోటా (బీ కేటగిరి) కింద విద్యార్థులను భర్తీ చేసుకుని చివరికి సీట్లు లేవనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో యాజమా న్యం వారు మేనేజ్‌మెంట్‌ కోటాకింది విద్యార్థులను భర్తీ చేసుకుని. డబ్బులు తీసుకోవటంతో పాటు సర్టిఫికెట్లను జమ చేసుకున్నారు. ప్రస్తుతం తీసుకున్న డబ్బులు, సమర్పించుకున్న సర్టిఫికెట్లను తిరి గి ఇచ్చేయడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం తో గొడవపడి ఆందోళనకు దిగారు. సీట్ల కోటా తక్కువ ఉన్నప్పుడు విద్యార్థుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం సమంజసం కాదని పలువురు ఆరోపించారు. కనీసం బీ కేటగిరి వివరాలు ఆన్‌లైన్‌లో చూసుకోవటానికీ వీలు లేకుండా కళాశాల వెబ్‌సైట్‌ను మూ సేశారని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆరోపించారు. పిల్లలకు కళాశాలలో సీటు దొరికిందని సంబురపడగా కళాశాల యాజమా న్యం తమకు షాక్‌కు గురిచేసిందన్నారు. కళాశాల యాజమాన్యం వారు చెల్లించిన డబ్బులు తిరిగివ్వటంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని విద్యార్ధుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Aug 16 , 2024 | 11:38 PM