Share News

పేదల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం

ABN , Publish Date - Dec 31 , 2024 | 11:54 PM

పేదల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. దేశంలో మరేరాష్ట్రంలో లేని విధంగా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షలు అందిస్తుందన్నారు. ఆమనగల్లు, కడ్తాల్‌, వెల్దండ, తలకొండపల్లి మండలాలకు చెందిన పలువురు లబ్దిదారులకు మంజూరైన రూ.2.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బాధిత కుటుంబాలకు నారాయణ రెడ్డి అందజేశారు.

పేదల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం
చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఆమనగల్లు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): పేదల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. దేశంలో మరేరాష్ట్రంలో లేని విధంగా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షలు అందిస్తుందన్నారు. ఆమనగల్లు, కడ్తాల్‌, వెల్దండ, తలకొండపల్లి మండలాలకు చెందిన పలువురు లబ్దిదారులకు మంజూరైన రూ.2.50 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను మంగళవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో బాధిత కుటుంబాలకు నారాయణ రెడ్డి అందజేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అర్హులైన నిరపేలందరికీ దశలవారిగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కిషన్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ అనంతరెడ్డి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీను, నాయకులు శ్రీశైలం, సురేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, దారెడ్డి అంజన్‌ రెడ్డి, వెంకటేశ్‌, రామకృష్ణ, నర్సింహ, రమేశ్‌, రమేశ్‌గౌడ్‌, బాబా, విఠలయ్య గౌడ్‌, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

కొత్త సంవత్సరంలో మరింత ప్రగతి : కసిరెడ్డి

ఆమనగల్లు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరంలో కల్వకుర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెంది అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 2025 నూతన సంవత్సరం సందర్బంగా మంగళవారం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. 2025 సంవత్సరం అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందని నారాయణరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 11:54 PM