మంటలు చెలరేగి కారు దగ్ధం
ABN , Publish Date - Jun 03 , 2024 | 12:09 AM
మండలంలోని మేకవనంపల్లి-సదాశివపేటకు వెళ్లేమార్గంలో ఆదివారం ఓ కారు పూర్తిగా దగ్ధమైంది.
మోమిన్‌పేట్, జూన్ 2: మండలంలోని మేకవనంపల్లి-సదాశివపేటకు వెళ్లేమార్గంలో ఆదివారం ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. ఉదయం సదాశివపేట నుంచి మోమిన్‌పేట్‌కు వచ్చీపోయే వాహనదారులు, ప్రయాణికులు తీవ్రఇబ్బందులకు గురయ్యారు. ఆ దగ్ధమైన కారును అక్కడి నుంచి తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. ఆ కారు ఎక్కడిది, ఎవరిదనే విషయాలు తెలియలేదని గ్రామస్థులు తెలిపారు.