కేదార్‌నాథ్ నమూనా ఆలయ నిర్మాణం అభినందనీయం
ABN , Publish Date - Jul 18 , 2024 | 12:28 AM
ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధ కేదార్‌నాథ్‌స్వామి ఆలయం వంటిదే ఎల్లంపేటలోనూ నిర్మించటం అభినందనీయమని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
మేడ్చల్ టౌన్, జూలై 17: ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధ కేదార్‌నాథ్‌స్వామి ఆలయం వంటిదే ఎల్లంపేటలోనూ నిర్మించటం అభినందనీయమని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఎల్లంపేటలో నిర్మిస్తున్న కేదార్‌నాథ్ ఆలయానికి భూమిపూజలో ఎంపీ పాల్గొన్నారు. ఉత్తర భారతానికి వెళ్లలేని వారు ఇక్కడే స్వామివారిని దర్శించేభాగ్యం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కాశీ పీఠాధిపతి నరేంద్రనాథ్ సరస్వతి, కమల్‌నయన్ దాస్, మణిరామ్‌దాస్ పూజలు నిర్వహించారు. మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, నాయకులు జగన్‌గౌడ్, దొడ్లమల్లి కార్జున్, ఆంజనేయులు ముదిరాజ్, జయ్‌పాల్‌సింగ్ పాల్గొన్నారు.