Share News

సీపీఐ చరిత్రను ప్రజలకు చాటి చెప్పాలి

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:48 PM

భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) చరిత్రను, సాధించిన ఉద్యమ ఫలితాలను ప్రజలకు వివరించాలని పార్టీ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య పిలుపునిచ్చారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో శత వసంతోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం షాద్‌నగర్‌లో నాయకులతో కలిసి జంగయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ 1925 డిసెంబరు 26న కాన్పూర్‌ నగరంలో సీపీఐ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. స్వాతంత్య్ర సమరంతో పాటు పేదలకు భూమి, భుక్తి నుంచి కల్పించాలని ఎన్నో పోరాటాలు చేసిందని తెలిపారు.

సీపీఐ చరిత్రను ప్రజలకు చాటి చెప్పాలి
షాద్‌నగర్‌ అర్బన్‌ : పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు

పార్టీ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య

షాద్‌నగర్‌ అర్బన్‌/షాబాద్‌, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) చరిత్రను, సాధించిన ఉద్యమ ఫలితాలను ప్రజలకు వివరించాలని పార్టీ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య పిలుపునిచ్చారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో శత వసంతోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం షాద్‌నగర్‌లో నాయకులతో కలిసి జంగయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ 1925 డిసెంబరు 26న కాన్పూర్‌ నగరంలో సీపీఐ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. స్వాతంత్య్ర సమరంతో పాటు పేదలకు భూమి, భుక్తి నుంచి కల్పించాలని ఎన్నో పోరాటాలు చేసిందని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు పేదల పక్షాన పోరాటాలు చేస్తున్న సీపీఐ చరిత్రను ప్రతీ వ్యక్తికి తెలియజేయాలన్నారు. 99 సంవత్సరాలు పూర్తిచేసుకుని వందేళ్లకు చేరుతున్న సందర్భంగా చేవెళ్ళ, ఎల్బీనగర్‌ ప్రాంతాలలో భారీ బహిరంగ సభలను నిర్వహించబోతున్నట్లు జంగయ్య తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పానుగంటి పర్వతాలు, శ్రీనునాయక్‌, చందుయాదవ్‌, లింగంనాయక్‌, చంద్రబాబు, కిషన్‌, పవన్‌ చౌహన్‌, రాజు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌ మండల కేంద్రంలో సీపీఐ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని నాయకులతో కలిసి జంగయ్య పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉత్సవాలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26న రంగారెడ్డి జిల్లాలోని గ్రామగ్రామాన పార్టీ జెండాలను ఎగురవేయాలని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రామస్వామి, షాబాద్‌ మండల కార్యదర్శి జంగయ్య, నాయకులు రాములు, శేఖర్‌, శ్రీశైలం, రాములు, రఘురాం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:48 PM