Share News

ఇంజనీరింగ్‌ కాలేజీలో సీటు ఇప్పిస్తామని..

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:28 AM

గుర్తుతెలియని వ్యక్తులు గీతం యూనివర్సిటీలో ఆడ్మిషన్‌ ఇప్పిస్తామని చెప్పి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రూ.18.50 లక్షలు తీసుకొని మోసగించిన ఘటన శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ అబీబుల్లాఖాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండల కేంద్రంలో నివాసం ఉంటున్న పి.విఠల్‌రెడ్డి-ప్రభావతిలకు ఒక్కగానొక్క కూతురు ఉంది. ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌క్లా్‌సలో పాసయ్యింది.

 ఇంజనీరింగ్‌ కాలేజీలో సీటు ఇప్పిస్తామని..

రూ.18.50 లక్షలకు టోకరా

శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు

చేవెళ్ల, సెప్టెంబరు 6 : గుర్తుతెలియని వ్యక్తులు గీతం యూనివర్సిటీలో ఆడ్మిషన్‌ ఇప్పిస్తామని చెప్పి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రూ.18.50 లక్షలు తీసుకొని మోసగించిన ఘటన శంకర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ అబీబుల్లాఖాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండల కేంద్రంలో నివాసం ఉంటున్న పి.విఠల్‌రెడ్డి-ప్రభావతిలకు ఒక్కగానొక్క కూతురు ఉంది. ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌క్లా్‌సలో పాసయ్యింది. తల్లిదండ్రులు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు మండల పరిధిలోని రుద్రారం పరిధిలో ఉన్న గీతం యూనివర్సిటీలో బీటెక్‌ చదివించాలని వర్సిటీకి వెళ్లారు. అయితే అక్కడ అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి విఠల్‌రెడ్డి, ప్రభావతిలకు పరిచయమయ్యాడు. తాను గీతం యూనివర్సిటీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నానని, మీ కూతురుకు ఇంజనీరింగ్‌ (బీటెక్‌)లో సీటు ఇప్పిస్తానని నమ్మించాడు. సీటు కావాలంటే 4సంవత్సరాలకు కలిపి మొత్తం రూ.16 లక్షలు ఖర్చు అవుతుందని, ఒకేసారి చెల్లిస్తే రూ.5 లక్షలు కళాశాల యాజమాన్యంతో మాట్లాడి డిస్కాంట్‌ ఇప్పిస్తానని దంపతులను నమ్మించాడు. దాంతో వారు రూ.3 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించారు. వారంరోజుల తర్వాత మిగిలిన డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చారు. వారం రోజుల వ్యవధిలోనే అనిల్‌కుమార్‌ తన స్నేహితు రోహిత్‌తో కలిసి శంకర్‌పల్లిలో ఉన్న విఠల్‌రెడ్డి, ప్రభావతిలా ఇంటికి వచ్చారు. దంపతులు అనిల్‌కుమార్‌కు రూ. 8 లక్షల నగదు ఇంజనీరింగ్‌ సీటు కోసం ఇచ్చారు. మరో వారం రోజులు గడిచిన తర్వాత అనిల్‌కుమార్‌ అతని స్నేహితుడు రోహిత్‌తో కలిసి శంకర్‌పల్లిలో ఉన్న దంపతులు ఇంటికి వచ్చారు. రోహిత్‌ నగరంలోని గచ్చిబౌలిలో కొత్తగా రెస్టారెంట్‌ పెడుతున్నాడని, మీరు పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని దంపతులను నమ్మించారు. వారి మాటలు నమ్మిన దంపతులు రోహిత్‌ అకౌంట్‌కు రూ.7లక్షల 50 వేలు ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేశారు. ఆ తర్వాత తమ కూతురుకు ఇంజనీరింగ్‌ సీటు ఎప్పుడొస్తుందని తెలుసుకునేందుకు అనిల్‌కుమార్‌కు దంపతులు ఫోన్‌చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. రోహిత్‌కు ఫోన్‌చేసిన కూడా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. వారం, పది రోజులుగా వారిద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్‌ రావడంతో అనుమానం వచ్చి గీతం యూనివర్సిటీకి వెళ్లి అడిగితే సరైన సమాధానం రాలేదు. దాంతో మోసపోయామని రోధిస్తూ శుక్రవారం శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో అనిల్‌కుమార్‌, రోహిత్‌లపై ఫిర్యాదు చేశారు. మొత్తం రూ.18 లక్షల 50 వేలు తీసుకున్నారని ప్రభావతి పోలీ్‌సలకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ తెలిపారు.

Updated Date - Sep 07 , 2024 | 12:28 AM