Share News

దసరా మామూళ్లంటూ వైద్యుడికి బెదిరింపులు

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:06 AM

దసరా మామూళ్ల కోసం వైద్యుడిని బెదిరించిన ఐదుగురు ఆన్‌లైన్‌ రిపోర్టర్లపై శంకర్‌పల్లి పోలీసులు మంగళవారం అర్ధరాత్రి కేసు నమోదు చేశారు. శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలోని శ్రీలక్ష్మీ నర్సింగ్‌ హోమ్‌ ఆసుపత్రికి ఆన్‌లైన్‌ రిపోర్టర్లు రాజే్‌షగౌడ్‌, సాయి కిరణ్‌రెడ్డి, ప్రతాప్‌, సుధాకర్‌ గౌడ్‌, మల్లేష్‌ గౌడ్‌లు మంగళవారం సాయంత్రం దసరా మామూళ్ల కోసమని వెళ్లారు.

దసరా మామూళ్లంటూ వైద్యుడికి బెదిరింపులు

ఐదుగురు ఆన్‌లైన్‌ రిపోర్టర్లపై కేసు

చెవేళ్ల, అక్టోబర్‌ 9 : దసరా మామూళ్ల కోసం వైద్యుడిని బెదిరించిన ఐదుగురు ఆన్‌లైన్‌ రిపోర్టర్లపై శంకర్‌పల్లి పోలీసులు మంగళవారం అర్ధరాత్రి కేసు నమోదు చేశారు. శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలోని శ్రీలక్ష్మీ నర్సింగ్‌ హోమ్‌ ఆసుపత్రికి ఆన్‌లైన్‌ రిపోర్టర్లు రాజే్‌షగౌడ్‌, సాయి కిరణ్‌రెడ్డి, ప్రతాప్‌, సుధాకర్‌ గౌడ్‌, మల్లేష్‌ గౌడ్‌లు మంగళవారం సాయంత్రం దసరా మామూళ్ల కోసమని వెళ్లారు. రూ.10 వేలు ఇవ్వాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. అయితే, డబ్బులు ఇచ్చేది లేదంటూ వైద్యుడు లక్ష్మీకాంత్‌రెడ్డి ఖరాకండిగా చెప్పారు. డబ్బులు ఇవ్వకపోతే ఆసుపత్రికి సంబంధించిన లొసుగులను బయటపెట్టి, లైసెన్సును రద్దు చేయిస్తామని రిపోర్టర్లు బెదిరించారు. దాంతో లక్ష్మీకాంత్‌రెడ్డి శంకర్‌పల్లి పోలీసులకు ఆ ఐదుగురిపై ఫిర్యాదు చేశాడు. శంకర్‌పల్లి సీఐ శ్రీనివా్‌సగౌడ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 10 , 2024 | 07:22 AM