Share News

జినుగుర్తిలో ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం

ABN , Publish Date - Oct 10 , 2024 | 12:40 AM

మండలంలోని జినుగుర్తిలో గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం చేశారు. అందులో ఉన్న సామగ్రిని దొంగిలించారు.

జినుగుర్తిలో ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం

తాండూరు రూరల్‌, అక్టోబరు 9: మండలంలోని జినుగుర్తిలో గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ధ్వంసం చేశారు. అందులో ఉన్న సామగ్రిని దొంగిలించారు. ఈ ంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. జినుగుర్తి శివారులోని అమృత్‌రెడ్డి పొలంలో 25కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఉంది. ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ కింద రైతులు రవికుమార్‌, చెన్నప్ప, రాములు, మొగులప్ప, అనంతప్ప వ్యవసాయ బోరు మోటార్ల కింద ఉల్లిపంటసాగు చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ట్రాన్స్‌ఫార్మర్‌ లోపల ఉన్న సామగ్రి కాపర్‌వైరు, ఆయిల్‌, కాయల్స్‌ను ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం రైతులు పొలానికి వెళ్లి చూసేసరికి ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి అందులో ఉన్న సామగ్రి కనిపించలేదు. వెంటనే రైతులు కరన్‌కోట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Updated Date - Oct 10 , 2024 | 06:31 AM