Share News

విద్యుదాఘాతంతో రెండు పాడి ఆవులు మృతి

ABN , Publish Date - Sep 26 , 2024 | 11:29 PM

విద్యుదాఘాతంతో రెండు పాడి ఆవులు మృతిచెందిన సంఘటన ఫరూఖ్‌నగర్‌ మండలం రంగంపల్లిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడు, గ్రామస్తుల కథనం ప్రకారం..

విద్యుదాఘాతంతో రెండు పాడి ఆవులు మృతి

షాద్‌నగర్‌ రూరల్‌, సెప్టెంబరు 26: విద్యుదాఘాతంతో రెండు పాడి ఆవులు మృతిచెందిన సంఘటన ఫరూఖ్‌నగర్‌ మండలం రంగంపల్లిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రా మ శివారులోని పొలంలో ప శువులు మేత చేస్తున్నాయి. ఈక్రమంలో రంగంపల్లి జవాజీ రమే్‌షకు చెందిన రెండు పశువులు కూడా మేత మేస్తున్నాయి. ఈక్రమంలో విద్యుత్‌ తీ గలు తెగి ఆవులపై పడ్డాయి. దాంతో అక్కడికక్కడే మృతి చెందాయి. ఇటీవలే ఒక ఆవును రూ.75 వేలకు, మరో ఆవును రూ.65 వేలకు కొనుగోలు చేసినట్లు రమేష్‌ దంపతులు తెలిపారు. ఆవులు మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. పాడిఆవులు మృతి చెందడంతో జీవనాధారం కోల్పోయామని, ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వారు కోరారు.

Updated Date - Sep 26 , 2024 | 11:29 PM