కేటీఆర్‌పై అక్రమ కేసును ఖండిస్తున్నాం
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:48 PM
ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు పెట్టి ఏ1గా చేర్చటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వికారాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈరేస్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు పెట్టి ఏ1గా చేర్చటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిలో ఎక్కడ కూడా డబ్బులు కేటీఆర్ దుర్వినియోగం చేసిలేదని, హైదరాబాద్ ప్రతిష్ట పెంచే విధంగా ఈ కార్ రేసింగ్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చిన ఘనత కేటీఆర్‌కు దక్కుతుందన్నారు. ఇటీవల లగచర్ల రైతులపై, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై కేసుల విషయం మరిచిపోక ముందే కేటీఆర్‌పై కేసు పెట్టడం అన్యాయమని అన్నారు. తమకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.
పరిగిలో సీఎం దిష్టిబొమ్మ దహనం
పరిగి: మాజీ మంత్రి కేటీఆర్‌పై ఫార్ములా ఈరేస్ సంబంధించి అక్రమ కేసు పెట్టడాన్ని నిరసిస్తూ, బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పరిగిలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్‌ఎస్ నాయకులు దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎం.అశోక్, మాజీ ఎంపీపీ అరవింద్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సురేందర్, పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, భాస్కర్, రవికుమార్, ఆసిఫ్ పాల్గొన్నారు.