Share News

ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:18 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేపట్టేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.సామ్యేల్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో జరిగిన సీపీఎం మున్సిపల్‌ మూడో మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి
మహాసభలో మాట్లాడుతున్న సామ్యేల్‌

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేపట్టేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.సామ్యేల్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని పాషా నరహరి స్మారక కేంద్రంలో జరిగిన సీపీఎం మున్సిపల్‌ మూడో మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చలేకపోతుందన్నారు. రైతు భరోసా లేదని, రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రూ.2500 ఆర్థికసాయం లేదని, ఆసరా పింఛన్లు పెంచి ఇవ్వడం లేదంటూ విమర్శలు చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం మున్సిపాలిటీ కార్యదర్శిగా ఎల్లేష్‌

సీపీఎం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యదర్శిగా మరోమారు ఎల్లే్‌షను ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా వీరేషం, బి.యాదగిరి, పురుషొత్తం, ముసలయ్య, శంకర్‌, స్వప్న, షఫీయున్నీసా, భిక్షపతిలను ఎన్నుకున్నారు.

Updated Date - Dec 07 , 2024 | 12:18 AM