గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:14 AM
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు.
తాండూరు రూరల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మండలంలోని ఓగీపూర్, కరన్‌కోట్, చంద్రవంచ, చిట్టిఘనాపూర్, బెల్కటూర్, చెంగోల్, చింతామణిపట్నం, పర్వతాపూర్, చెనిగే్‌షపూర్, కొణాపూర్, ఎల్మకన్నె, వీర్‌శెట్టిపల్లి, గోనూరు, నారాయణపూర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా 27 పనులకు గాను రూ.3కోట్ల 22లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలో రాక్షస పాలన అంతమైందని, ప్రజాపాలన ఆరంభమైందన్నారు. కరన్‌కోట్‌లో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని త్వరలోనే పేదలకు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్‌గౌడ్, బాల్‌రెడ్డి, ఉత్తంచంద్, శరణుబసప్ప, నాగప్ప, రాజ్‌కుమార్, శివకుమార్, జర్నప్ప, అనిల్, సుధాకర్, హర్షవర్ధన్‌రెడ్డి, మల్లారెడ్డి, రాజేందర్‌రెడ్డి, నారాయణరెడ్డి, జి.రాందాస్, జగదీశ్వర్ పాల్గొన్నారు.
కరన్‌కోట్ పాఠశాల సందర్శన
తాండూరు మండలంలోని కరన్‌కోట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం అనంతరం పదో తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థుల తరగతికి వెళ్లి విద్యార్థులతో ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం వంట గదిలోకి వెళ్లి మధ్యాహ్న భోజనం అన్నం, కూరగాయలను పరిశీలించారు. నాసిరకంగా వండితే ఏజెన్సీ రద్దు చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కాగా, కరన్‌కోట్, బెల్కటూర్, ఓగీపూర్, గౌతాపూర్ గ్రామాల్లో కొంత మంది మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
తాండూరు: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం రెండవ రోజు తాండూరు మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ స్వప్న మురుగు కాల్వలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో 20, 25, 27వార్డుల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. మురుగు కాల్వలను శుభ్రంచేసి బ్లీచింగ్ చల్లించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ విక్రం సింహారెడ్డి, కౌన్సిలర్లు ప్రభాకర్‌గౌడ్, సంగీత ఠాకూర్, మేనేజర్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.