నాటడం ఎందుకు.. నరకడం ఎందుక?
ABN , Publish Date - Nov 15 , 2024 | 11:55 PM
మండలంలోని పలు గ్రామాల్లో రెండు రోజులుగా ట్రాన్స్‌కో అధికారులు చెట్లకొమ్మలు నరికి వేయిస్తున్నారు. ఐదేళ్ల క్రితం విద్యుత్ వైర్ల కింద ప్రజాప్రతినిధులు, విద్యార్థులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అవి నేడు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి.
రోడ్డుపక్కన ఏపుగా పెరిగిన చెట్లకొమ్మలు నరికివేత
యాచారం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో రెండు రోజులుగా ట్రాన్స్‌కో అధికారులు చెట్లకొమ్మలు నరికి వేయిస్తున్నారు. ఐదేళ్ల క్రితం విద్యుత్ వైర్ల కింద ప్రజాప్రతినిధులు, విద్యార్థులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అవి నేడు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. ఈక్రమంలో గురువారం మండల కేంద్రంలోని హైదరాబాద్-సాగర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలన్నింటినీ అధికారులు నరికివేయించారు. మండల కేంద్రంలోని గాంధీజీ విగ్రహం వెనకాల ఉన్న చెట్లకొమ్మలను నరికి చేతులు దులుపుకున్నారు. కొమ్మలు విగ్రహంపై పడి ఉన్నాయి. శుక్రవారం కూడా వాటిని తీయించలేకపోయారు. చౌదర్‌సల్లి, మొండిగౌరెల్లి, నల్లవెల్లి తదితర గ్రామాల్లో రోడ్డు పక్కన ఎల్టీ 11 కేవీ విద్యుత్ వైర్ల కింద ఉన్న చెట్ల కొమ్మలన్నింటినీ నరికివేయించారు. మొక్కలు నాటిన పిదప నరకడమెందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.