భార్యాభర్తలకు టీచర్ ఉద్యోగాలు
ABN , Publish Date - Oct 10 , 2024 | 12:04 AM
ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి భార్యాభర్తలు ఇద్దరూ టీచర్ ఉద్యోగాలు సాధించారు.
ధారూరు, అక్టోబరు 9 : ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి భార్యాభర్తలు ఇద్దరూ టీచర్ ఉద్యోగాలు సాధించారు. ధారూరు చెందిన కావలి జ్యోతి, బాలకృష్ణ భార్యభర్తలు. జ్యోతికి జిల్లా స్థాయిలో 7వ ర్యాంకు రాగా, బాలకృష్ణకు 46వ ర్యాంక్ వచ్చింది. ఇద్దరికి ఉపాధ్యాయ పోస్టులు దక్కడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కాగా, కావలి జ్యోతి ధారూర్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
వికారాబాద్‌కు చెందిన అక్కాచెల్లెళ్లకూ..
వికారాబాద్: లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో చదివిన అక్కాచెల్లెళ్లు డీఎస్సీలో ఎస్జీటీ ఉద్యోగాలు సాధించి కన్నవారి కలలను నెరవేర్చారు. వికారాబాద్ పట్టణంలోని ఎంఐజీ కాలనీకి చెందిన మహమ్మద్ సాబేర్ కూతుళ్లు నిఖాతునిస, షాహీన్నీసా ఇద్దరు అక్కాచెల్లెలు. వారు ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా వారికి బంధువులు, స్థానికులు అభినందనలు తెలిపారు.