Share News

కుటుంబ కలహాలతో భర్తపై భార్య, కుమారుడు దాడి

ABN , Publish Date - Jun 15 , 2024 | 12:15 AM

కుటుంబ కలహాలు ఓ వ్యక్తి హత్యకు దారితీశాయి. మండలంలోని తుమ్మలకుంట తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమనగల్లు సీఐ ప్రమోద్‌ కుమార్‌ తెలిపిన వివరాల మేరకు తలకొండపల్లి మండలం తుమ్మల కుంట తండాకుచెందిన మూడావత్‌ పాండుతో అతడి భార్య శాంతి, కుమారుడు శ్రీహరిలు కుటుంబ విషయంలో కొంతకాలంగా గొడవపడుతూ వస్తున్నారు.

కుటుంబ కలహాలతో భర్తపై భార్య, కుమారుడు దాడి

చికిత్స పొందుతూ మృతి

తలకొండపల్లి, జూన్‌ 14: కుటుంబ కలహాలు ఓ వ్యక్తి హత్యకు దారితీశాయి. మండలంలోని తుమ్మలకుంట తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమనగల్లు సీఐ ప్రమోద్‌ కుమార్‌ తెలిపిన వివరాల మేరకు తలకొండపల్లి మండలం తుమ్మల కుంట తండాకుచెందిన మూడావత్‌ పాండుతో అతడి భార్య శాంతి, కుమారుడు శ్రీహరిలు కుటుంబ విషయంలో కొంతకాలంగా గొడవపడుతూ వస్తున్నారు. ఈనెల 12న ఇంట్లో మరోసాఇరి పెద్ద గొడవ జరిగింది. దాంతో పాండు(45)పై శాంతి, శ్రీహరిలు కర్రలతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాండును హైదరాబాద్‌లోని రెండు ప్రైవేట్‌ ఆసుపత్రులకు.. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందినట్లు సీఐ తెలిపారు. మృతుడు పాండు సోదరుడు రాముడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 15 , 2024 | 12:15 AM