Share News

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

ABN , Publish Date - Sep 14 , 2024 | 11:43 PM

ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ మహిళ శుక్రవారం రాత్రి పెద్ద చెరువులోదూకి ఆత్మహత్య చేసుకుంది.

చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 14 : ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ మహిళ శుక్రవారం రాత్రి పెద్ద చెరువులోదూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం మధ్యాహ్నం ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. కుటుంబ కలహాలతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇబ్రహీంపట్నం వెంకటరమణ కాలనీకి చెందిన కప్పాటి మంజుల(48) లంగర్‌హౌ్‌సలో జీహెచ్‌ఎంసీ ఔట్‌ సోర్సింగ్‌ స్వీపర్‌గా పనిచేసేది. రెండు నెలల క్రితమే ఆమె భర్త పున్నయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. ఈమెకు మగ్గురు కుమారులు. కుటంబంలో గొడవల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Updated Date - Sep 14 , 2024 | 11:43 PM