యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Oct 29 , 2024 | 11:59 PM
అనారోగ్య కారణంతో ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఘట్‌కేసర్ రూరల్, ఆక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అనారోగ్య కారణంతో ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన ఘట్‌కేసర్ పోలీ్‌సస్టేషన్ పరిఽధిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సీఐ పరశురాం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఘట్‌కేసర్, బాలాజీ నగర్‌కు చెందిన బర్ల కిష్టయ్య కుమారుడు బర్ల కుమార్ అలియాస్ శివ(32) కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతుండేవాడు. నొప్పిభరించలేక మంగళవారం మధ్యాహ్నం ఘట్‌కేసర్ చిన్నచెరువు సమీపంలో చెట్టుకింద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.