యువకుడు అదృశ్యం.. కేసు నమోదు
ABN , Publish Date - Oct 10 , 2024 | 12:04 AM
యువకుడు అదృశ్యమైన సంఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. శంషాబాద్ మండలం తొండపల్లికి చెందిన జగదీశ్వర్ ఈనెల 1న సొంత గ్రామం అప్పారెడ్డిగూడకు వెళ్లున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి వెళ్లాడు.
శంషాబాద్ రూరల్, అక్టోబరు 9: యువకుడు అదృశ్యమైన సంఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. శంషాబాద్ మండలం తొండపల్లికి చెందిన జగదీశ్వర్ ఈనెల 1న సొంత గ్రామం అప్పారెడ్డిగూడకు వెళ్లున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. అతడి తల్లి అలివేలు శంషాబాద్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.