ఎద్దడిని అధిగమించేందుకే నీటి విడుదల
ABN , Publish Date - Apr 18 , 2024 | 11:38 PM
తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకే డిండి ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఈఈ శ్రీధర్‌రావు తెలిపారు.
ఎద్దడిని అధిగమించేందుకే నీటి విడుదల
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
21 అడుగుల వద్ద నిలిపివేస్తాం : డిండి ప్రాజెక్టు ఈఈ శ్రీధర్‌రావు
రైతులతో చర్చలు జరిపిన ఆర్డీవో శ్రీరాములు, ఈఈ
డిండి, ఏప్రిల్ 18: తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకే డిండి ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఈఈ శ్రీధర్‌రావు తెలిపారు. మండలకేంద్రంలోని ఉపకార్యాలయంలో దేవరకొండ ఆర్డీవో శ్రీరాములు, ఈఈ శ్రీధర్‌రావులు గు రువారం రైతులతో జరిపిన చర్చలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిండి ప్రాజెక్టు నీటి విడుదలను 21 అడుగుల వద్ద నిలిపివేస్తామని నీ టిపారుదల శాఖ ఈఈ శ్రీధర్‌రావు తెలిపారు. నీటి విడుదలను నిలిపివేయాలని రైతులకు ఆందోళన చేసిన ఉన్నతాధికారుల ఆ దేశాల మేరకే నీటిని విడుదల చేసినట్లు వారు తెలిపారు. చం దంపేట, నేరేడుగొమ్ము మండలాలలోని 14 చెరువులతో పాటు డిండి ప్రాజెక్టు ఆయకట్టులోని 18 చెరువులు కుంటలు కూడా నింపుతామని నీటి పారుదల శాఖ ఈఈ రైతులకు తెలిపారు. దీనికి రైతులు అంగీకరించారు. చందంపేట, నేరేడుగొమ్ము మం డలాల్లో చెరువులకు కుంటలు నింపేందుకు ఈ నెల 15వ తేదీన డిండి ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలను డిండి ఆయకట్టు రైతులు వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. చందంపేట నేరేడుగొమ్మ మండలాల చెరువులు కుంటలు నింపడంతో బోరు బావుల్లో భూగర్భజలాలు పెరుగుతాయని మూగజీవాలకు తాగునీరు అందుతుందని తెలిపారు. డిండి ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 36అడుగులు (2.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 29.2 అడుగుల (1.8 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఉన్న నీటిలో 0.8 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని తెలిపారు. మిగిలిన ఒక టీఎంసీ (21 అడుగులు) నీటిని డిండి ప్రాజెక్టు ఆయకట్టులోని 12,500 ఎకరాలకు 36 రోజులకు సరిపోతుందని తెలిపారు. ప్రాజెక్టు నుంచి రోజు 200 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. నీరు వృథా కాకుం డా అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాల్వలు ఉన్న చెరువులు, కుంటలకు మాత్రమే నీటిని విడుదల చేస్తామని ఆ యన తెలిపారు. చర్చల్లో పాల్గొన్న రైతులు రాజనేని వెంకటేశ్వరరావు నాగార్జునరెడ్డి, కృష్ణ నరసింహారావు, వానం నరేందర్‌రెడ్డి, అంజల్‌రావు, రవీందర్రావు, బాబురావు, బొడ్డుపల్లి జయంతతో పాటు డీఈ శ్రీనివాస్, ఏఈ ఫయాజ్ పాల్గొన్నారు.