Share News

అసైన్డ్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:26 PM

కీసర మండల పరిధి అంకిరెడ్డి గ్రామంలోని అసైన్డ్‌ ల్యాండ్‌లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు.

అసైన్డ్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు
కూల్చివేసిన అక్రమ నిర్మాణాలు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

కీసరరూరల్‌, అక్టోబరు 1 : కీసర మండల పరిధి అంకిరెడ్డి గ్రామంలోని అసైన్డ్‌ ల్యాండ్‌లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు. ‘అసైన్డ్‌లో అక్రమ నిర్మాణాలు’ శీర్షికన ఈనెల 25న ఆంధ్రజ్యోతి దినపత్రికలో కథనం ప్రచురితమైన కథనానికి అధికారుల్లో కదలిక వచ్చింది. అంకిరెడ్డిపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 780/బిలోని అసైన్ట్‌ స్థలంలో గతంలో ప్రభుత్వ భూమి అని సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. అయితే కొందరు రియల్టర్లు ఆ బోర్డు తొలగించి 80గజాల చొప్పున ప్లాట్లు చేసి ప్రజలకు అంటగట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు కలెక్టర్‌, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన రెవెన్యూ అధికారులు అసైన్డ్‌ భూమిలో వెలసినఅక్రమ నిర్మాణాలను ఎక్స్‌కవేటర్‌ సహాయంతో తొలగించారు. ప్రభుత్వస్థలాలు కబ్జా చేసినా, అక్రమనిర్మాణాలు చేపట్టినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ అశోక్‌ హెచ్చరించారు.రులు ఉన్నారు.

Updated Date - Oct 01 , 2024 | 11:26 PM