Share News

కోనో కార్పస్‌ చెట్ల తొలగింపు షురూ

ABN , Publish Date - Jul 30 , 2024 | 11:09 PM

శ్వాస కోశ వ్యాధు లకు కారణమవుతున్నాయన్న కారణంగా పురపాలి కపరిధిలో పెద్దఎత్తున నాటిన కోనోకార్పస్‌ జాతి మొక్కల తొలగింపు ప్రక్రియ షురూ అయింది.

 కోనో కార్పస్‌ చెట్ల తొలగింపు షురూ
బైపాస్‌లో కోనోకార్పస్‌ చెట్ల తొలగింపును పరిశీలిస్తున్న చైర్మన్‌, కమిషనర్‌

- బైపాస్‌లో వాటి స్థానంలో

పెద్దచెట్లు తీసుకువచ్చే ప్లాన్‌

- పనులను పరిశీలించిన

పుర చైర్మన్‌, కమిషనర్‌

మహబూబ్‌నగర్‌, జూలై 30: శ్వాస కోశ వ్యాధు లకు కారణమవుతున్నాయన్న కారణంగా పురపాలి కపరిధిలో పెద్దఎత్తున నాటిన కోనోకార్పస్‌ జాతి మొక్కల తొలగింపు ప్రక్రియ షురూ అయింది. ముందుగా బైపాస్‌ రహదారి మధ్యలో నాటిన మొక్కలను మూడ్రోజులుగా ఎక్స్‌కవేటర్‌ సాయం తో తొలగిస్తున్నారు. త్వరలోనే వాటి స్థానంలో పెద్ద మొక్కలను తీసుకువచ్చి నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పురపాలిక పరిధిలోని ప్రధాన రహదారులు, బాలుర జూనియర్‌ కళాశాల మైదానంతోపాటు ఇతర ప్రాంతాలలో ఈ మొక్కలను గతంలో నాటారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఏపుగా పెరగడంతో పాటు అందంగా మొక్కలు కనిపిస్తున్నాయి. తక్కువ సమయంలో గుబురుగా ఆకర్శనీయంగా కనిపించే ఈ మొక్కల పుప్పొడి ఆరోగ్యానికి హానికరమన్న ప్రచారం సాగుతుండటంతో ఇటీవల బాలుర జూనియర్‌ కళాశాల మైదానానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి వెళ్లిగా వాకర్స్‌ ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆరోగ్య పరిరక్షణకు వాకింగ్‌కు మైదానానికి వస్తున్నామని, ఇక్కడ మైదానం చుట్టూ కోనో కార్పస్‌ జాతి మొక్కలు ఉండటంతో వాటి వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అటవీశాఖ అధికారులు, మునిసిపల్‌ శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే ఆ జాతి మొక్కలను తొలగించి వాటి స్థానంలో పెద్దమొక్కలు తీసుకువచ్చి నాటా లని ఆదేశాలిచ్చారు. దీంతో మొక్కల తొలగింపు బాధ్యతలను పురపాలిక శాఖకు అప్పగించారు. ఇందుకోసం అనుమతులు తీసుకున్న అధికారులు బైపాస్‌ రహదారిలో చెట్ల తొలగింపు ప్రక్రియను ప్రారంభించగా, మంగళవారం మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి బైపాస్‌లో పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పట్టణంలో త్వరలోనే ఈ జాతి మొక్కలను తొలగించి ఆరోగ్యకర మైన మొక్కలను నాటతామని చెప్పారు.

Updated Date - Jul 30 , 2024 | 11:09 PM