Share News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలి

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:39 AM

సంస్థాననారాయణపురం డిసెంబరు 29 (ఆంధ్ర జ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మం డలం మల్లారెడ్డిగూడెం గ్రామంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎని కలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు దక్కాలన్నారు. రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీ లకు 69 శాతం రిజర్వేషన సౌకర్యం కల్పించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల వాటా బీసీలకు దక్కేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని, సీఎం రేవంతరెడ్డి అఖిలపక్ష పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రాన్ని ఒప్పించాలన్నారు. పిడికెడు శాతం మంది ఉన్న వాళ్లకు పదవులు ఇచ్చి 60 శాతానికి పైగా ఉన్న వారిని అణగదొక్కాలని చూస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో కుల గణన సర్వే సంపూర్ణంగా జరగలేదని, ప్రభుత్వం 98 శాతం కుల గణన జరిగిందని చెప్పడం సరికాదన్నారు. గుడిసెల్లో ఉన్న వారిని, వలస ప్రజలు, సంచార జాతులు లాంటి ప్రజలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. కుల గణన సంపూర్ణంగా జరగాలంటే బీహార్‌ రాష్ట్రంలో మాదిరిగా స్పెషల్‌ డైరవ్‌ చేపట్టాలని కోరారు. ముందుగా కుటుంబాలు ఉన్న వారిని, రెండో విడ తలో గుడిసెల్లో ఉన్న వారిని, సంచార జాతులను ప్రభుత్వం సర్వే చేస్తేనే సం పూర్ణ కులగణన జరుగుతుందని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుండే వెంకటేష్‌, కే.మల్లే శం, వీరమల్ల స్వామి, ఐలయ్య, నరసింహ, ఎట్టయ్య, లింగస్వామి మహేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 12:39 AM