Share News

TS News: హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టండి

ABN , Publish Date - Jun 19 , 2024 | 08:20 AM

ఏరోనాటిక్స్‌ రంగంలో హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఇప్పటికే హైదరాబాద్‌లో కొనసాగుతున్న సంస్థ పెట్టుబడులను మరింతగా విస్తరించాలన్నారు. లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోనాటిక్స్‌ ఇండియా డైరెక్టర్‌ మైఖేల్‌ ఫెర్నాండెజ్‌ మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.

TS News: హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టండి

లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోనాటిక్స్‌ ఇండియా డైరెక్టర్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఏరోనాటిక్స్‌ రంగంలో హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ ప్రతినిధులను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఇప్పటికే హైదరాబాద్‌లో కొనసాగుతున్న సంస్థ పెట్టుబడులను మరింతగా విస్తరించాలన్నారు. లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోనాటిక్స్‌ ఇండియా డైరెక్టర్‌ మైఖేల్‌ ఫెర్నాండెజ్‌ మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. ఇప్పటికే ఈ సంస్థ టాటా గ్రూప్‌తో కలిసి సంయుక్తంగా పెట్టుబడులు పెట్టింది. వీటిని మరింత విస్తరించాలని సీఎం కోరారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానం అమలు చేస్తోందన్నారు. ఇక్కడి పారిశ్రామిక అనుకూల విధానాలను ఉపయోగించుకోవాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు.

Updated Date - Jun 19 , 2024 | 08:20 AM