భగ్గుమంటున్న సన్న బియ్యం
ABN , Publish Date - Dec 26 , 2024 | 01:09 AM
ఓ వస్తువు ఉత్పత్తి పెరిగితే ధర తగ్గడం సాధారణమే. ప్రస్తుతం వరి ధాన్యానికి ఈ విషయం వర్తించడం లేదు. ఈ వర్షా కాలం సీజన్‌లో వివిధ కారణాలతో గతంలో కంటే సన్న రకం ఎక్కువగానే సాగైంది. మంచి దిగుబడులు సైతం వచ్చాయి.
జగిత్యాల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఓ వస్తువు ఉత్పత్తి పెరిగితే ధర తగ్గడం సాధారణమే. ప్రస్తుతం వరి ధాన్యానికి ఈ విషయం వర్తించడం లేదు. ఈ వర్షా కాలం సీజన్‌లో వివిధ కారణాలతో గతంలో కంటే సన్న రకం ఎక్కువగానే సాగైంది. మంచి దిగుబడులు సైతం వచ్చాయి. ఈ లెక్కన ధర తగ్గాల్సింది పోయి గత యే డాది కన్నా పెరగడం వినియోగదారుల్ని ఆందోళనకు గు రి చేస్తోంది. వీటికి తోడు నిత్యావసర సరకుల ధరలు పె రగడంతో సామాన్య మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది.
అంచనాకు మించి వరి సాగు..
జిల్లాలో వర్షాకాలం సీజన్‌లో సాధారణ సాగు 3.80 లక్షల ఎకరాలు కాగా సుమారు 4.50 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. సాధారణం కన్నా అధికంగా వరి పంట వేశారు. 33 రకాల సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాలుకు రూ. 500 అదనంగా ప్రభుత్వం బోనస్ ప్ర కటించడంతో మునుపెన్నడూ లేని రీతిలో సన్నరకం ధా న్యం సాగైంది. ఈ లెక్కన దిగుబడి సైతం పెరిగింది. వీ టన్నింటి నేపథ్యంలో ధర తగ్గాల్సి ఉండగా. ఆ పరిస్థితు లు ఎక్కడా కనిపంచడం లేదు. ప్రతి ఏటా ధరలు పెరు గుతాయన్న కారణంతో చాలా మంది ఏడాదికి సరిపోయే స్థాయిలో కొనుగోలు చేసి నిల్వ ఉంచుకుంటారు. పెరిగిన ధరలతో ఈ సారి కొనుగోలు చేసేందుకు తర్జన భర్జన పడుతున్నారు.
ప్రైవేటు ప్రభావంతోనే...
ఈ సారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడంతో పాటు నిబంధనల్ని కఠినతరం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న ధరకు మించిన స్థాయిలో ప్రైవేటులో ధర పలకడంతో అత్యధికులు ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లకే విక్రయించారు. ఇప్పుడు ప్రైవేటు వ్యాపారులు సన్న వడ్లనే మిల్లింగ్ చేసి గ్రామాలు ప ట్టణాల్లో విక్రయిస్తున్నారు. మిల్లింగ్ చేస్తే 60 నుంచి 65 కిలోల లోపే బియ్యం వస్తుండటంతో ధర పెంచక తప్ప డంలేదని వ్యాపారులు అంటున్నారు. అధికారుల నియం త్రణ లేకపోవడంతోనే ఉత్పత్తి పెరిగినా అమ్మకం దారు లు ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నారని వినియోగ దారులు అంటున్నారు. అక్రమంగా బియ్యాన్ని బయట ప్రాంతాలకు తరలించడం కూడా ధరలు అదుపులో లేక పోడానికి కారణమని అంటున్నారు.
బియ్యానికి డిమాండ్...
జిల్లాలో మొత్తం జనాభా 2011 లెక్కల ప్రకారం 8,13, 451 మంది కాగా ప్రస్తుతం సుమారు పది లక్షల వర కు జనాభా ఉంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల ఆధా రంగా జిల్లా వ్యాప్తంగా 3,07,127 కుటుంబాలు ఉన్నాయి. రేషన్ కార్డులు లేని కుటుంబాలు ఇంకా సుమారు 40 వేల వరకు ఉన్నాయన్న అంచనా ఉంది. గ్రామీణ ప్రాం తాల్లో అన్నమే ఎక్కువ తింటుంటారు. దీంతో జిల్లాకు ప్రతి నెలా కనీసం సరాసరిగా అయిదు లక్షల క్వింటాళ్ల బియ్యం అవసరమన్న అంచనా ఉంది. ఈ లెక్కన పెరిగి న ధరలతో సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులపై భారం ఏ మేరకు పడుతుంతో అర్థమవుతోంది.
మిల్లర్లు, రిటైల్ వ్యాపారుల దగా..
జీఎస్‌టీ రాకముందు మిల్లర్లు, వ్యాపారులు ప్రతి క్విం టాల్‌పై నాలుగు శాతం పన్నులు చెల్లించే వారు. కానీ జీఎస్‌టీ అమలులోకి వచ్చాక వ్యవసాయ ఆధారిత ఉత్ప త్తులపై పన్నులను పూర్తిగా తొలగించారు. అందులో భా గంగానే బియ్యంపై వ్యాట్‌ను పూర్తి ఎత్తివేశారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా సుమారు 150కి పైగా రైస్ మి ల్లులు వరి ధాన్యం రూపంలో చేసి వ్యాపారులకు అమ్మి తే గతంలో ఉన్న ఒక్క శాతం పన్నును 2019లో ప్రభు త్వం ఎత్తివేసింది. రైస్‌మిల్లర్లు ఒక్క శాతం ప్యాడీపై మా త్రమే మార్కెట్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్‌టీ వచ్చాక నాలుగు శాతం వ్యాట్‌ను ఎత్తివేశారు. ఒక్కశా తం పన్నును కూడా ఎత్తివేశారు. అయినప్పటికీ ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు. వ్య వసాయాధారిత ఉత్పత్తులు వినియోగదారులకు తక్కువ ధరలకే అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పన్నులను ఎత్తివేసింది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు బిన్నంగా ఉంది. వ్యాపారులు పన్నులు చెల్లించినప్పుడు బియ్యం ధరలు తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం పన్నుల రద్దు అయిన తదుపరి బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వం సరియైున రీతిలో పర్యవేక్షణ చేయని కారణంగానే వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
బియ్యం ధరలు ఇలా..
రకం.....................ప్రస్తుత ధర......గత యేడాది ధర
బీపీటీ (కొత్తవి).. రూ. 4,800...4,600
హెచ్‌ఎంటీ.... రూ. 5,700...5,200
జై శ్రీరామ్...రూ. 6,800....5,600