Share News

కోర్టు డ్యూటీ పోలీసుల పాత్ర కీలకం: ఎస్పీ

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:13 PM

నేరస్థులకు శిక్షలు పడటంలో కోర్టు డ్యూటీ పోలీసుల పాత్ర కీలకమని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు.

కోర్టు డ్యూటీ పోలీసుల పాత్ర కీలకం: ఎస్పీ

నారాయణపేట, జూలై 26: నేరస్థులకు శిక్షలు పడటంలో కోర్టు డ్యూటీ పోలీసుల పాత్ర కీలకమని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కోర్టు డ్యూటీ పోలీసుల శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. నేరాలు నియంత్రించ డంతో పాటు నేరాల కట్టడికి పకడ్బందీగా దర్యాప్తు చేసి సరైన సాక్షాలను వాంగ్ములాలు, సాంకేతిక ఆధారాలు సేకరించి కోర్టులో సమర్పించి నేరస్థుల కు శిక్ష పడేలా చూడాలన్నారు. పోలీసులు ప్రతీ ఒక్కరు బాగా పని చేసి జిల్లా పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకోరావాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, ఐటీ కోర్‌ ఎస్‌ఐ ఎస్‌ఐ సునీత, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.

డయల్‌ 100 కాల్స్‌పై వేగంగా స్పందించాలి

నారాయణపేట: డయల్‌ 100 కాల్స్‌పై వేగంగా పోలీసులు స్పందించాలని డీజీపీ జితేందర్‌ ఆదేశించారు. శుక్రవారం పోలీస్‌ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నారాయణపేట ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌, డీఎస్పీ లింగయ్య పాల్గొన్నారు. డయల్‌- 100 కాల్స్‌ వచ్చేటప్పుడు ఏర్పడే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిధిలో విధిగా వర్క్‌ షాపులు నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, కృష్ణదేవ్‌, రాజు, సునీత, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:13 PM