Share News

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి అటవీ అనుమతులు

ABN , Publish Date - Dec 04 , 2024 | 06:03 AM

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి అటవీ అనుమతులు లభించినట్లు రోడ్లు భవనాల

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి అటవీ అనుమతులు

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి అటవీ అనుమతులు లభించినట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారం కేంద్ర అటవీ శాఖ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కైలాష్‌ భీమ్‌రావు భవర్‌ నుంచి అందినట్లు పేర్కొన్నారు. ఈ అనుమతులతో మెదక్‌ జిల్లాలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 28.2544 హెక్టార్లు, భువనగిరి జిల్లాలో 8.511 హెక్టార్లు కలిపి మూడు జిల్లాల్లో 72.3536 హెక్టార్ల అటవీ భూమిని రీజినల్‌ రింగురోడ్డు నిర్మాణానికి వినియోగించడానికి అవకాశం దొరికింది. అటవీ అనుమతులకు లోబడి భూసేకరణ చేయనున్నారు. అటవీ అనుమతులు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ... కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Dec 04 , 2024 | 06:03 AM